మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర చేయాల‌నేది నా కోరిక: ర‌జ‌నీకాంత్

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 17-12-19 Namasthe Telangaana

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న న‌ట‌న‌తోనే కాదు మంచి మ‌న‌సుతోను లెక్క‌కి మించి అభిమానుల‌ని సంపాదించుకున్నారు. త‌న కెరీర్‌లో దాదాపు 167 సినిమాలు చేశారు. అనేక పాత్ర‌ల‌లో మెప్పించారు. అయితే ఎక్కువ‌గా పోలీస్ పాత్ర‌లే చేసిన ర‌జ‌నీకాంత్ మ‌ళ్ళీ 25 ఏళ్ళ త‌ర్వాత ద‌ర్భార్ చిత్రంలో పోలీస్‌గా న‌టించారు.

© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

ఈ చిత్ర ట్రైల‌ర్ వేడుక రీసెంట్‌గా జ‌ర‌గగా, ఈ కార్య‌క్ర‌మంలో ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ట్రాన్స్‌జండర్ క్యారెక్టర్ చేయలేదని, అటువంటి పాత్ర పోషించాలనుకుంటున్నానని తెలిపారు. పోలీస్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు.

అందులో చాలా సీరియ‌స్‌నెస్ ఉంటుంది. క్రిమిన‌ల్స్ వెంట ప‌రిగెత్తాలి. అందుకే ఇలాంటి పాత్ర‌ల‌లో చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంద‌ని ర‌జ‌నీకాంత్ స్ప‌ష్టం చేశారు.

సూప‌ర్ స్టార్ సంక్రాంతికి ద‌ర్భార్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఆయ‌న 168వ చిత్రం ఇటీవ‌ల లాంచ్ కాగా, ఈ మూవీ శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. కీర్తి సురేష్‌, ఖుష్బూ, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

స్లైడ్ షో: చూడముచ్చటైన సెలబ్రెటీ జంటలు

 


More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon