మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

పెళ్లి చేసుకున్న ప్రభాస్ భామ.. వైరల్ అవుతోన్న ఫోటోస్..

News18 తెలుగు లోగో News18 తెలుగు 17-12-19 P18 Staff
© News18 Telugu ద్వారా అందించబడింది

హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా వుంటోంది.హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లిన ఈ భామ అక్కడే ఓ అమెరికన్‌ను పెళ్లి చేసుకుంది.

తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ సరసన మెరిసిన రిచా సడెన్‌గా సినిమాలకు దూరం అయ్యింది.  ఆమె ఉన్నత విద్య కోసం వాషింగ్టన్‌ వెళ్లి.. అక్కడ తన సహ విద్యార్థి అయిన జోకుతో ప్రేమలో పడింది. 

ఆ క్రమంలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని ఈ ఏడాది జనవరిలో రిచా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అందులో భాగంగా తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

కాగా ఇటీవల జోతో రిచా వివాహం జరిగింది. వీరి పెళ్లి క్రిస్టియన్‌, హిందూ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగింది. దానికి సంబందించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయాన్ని రిచా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. రిచా తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘లీడర్‌’ సినిమాతో నటిగా పరిచయం అయ్యింది.  ఆ తర్వాత రవితేజ ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’, ప్రభాస్ ‘మిర్చి’లో అందాలతో అదరగొట్టింది రిచా. 

More from News18 Telugu

image beaconimage beaconimage beacon