మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

సింగ‌పూర్‌లో మైన‌పు విగ్ర‌హం.. కోరిక తీరిందంటున్న కాజ‌ల్

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 17-12-19 Namasthe Telangaana
© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

2007లో వ‌చ్చిన చంద‌మామ సినిమాతో తొలి హిట్ కొట్టి అంద‌రి దృష్టిని ఆకర్షించిన అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న కాజ‌ల్ ప్ర‌స్తుతం క‌మ‌ల్ స‌ర‌స‌న భార‌తీయుడు 2 చిత్రం చేస్తుంది.

హిందీలో ముంబై స‌గ అనే చిత్రంలో న‌టిస్తుంది. దాదాపు అన్ని దేశీయ భాష‌ల‌లో న‌టిస్తూ అభిమానుల ఆద‌రాభిమానాలు పొందుతున్న ఈ అమ్మ‌డి క‌ల తాజాగా నెర‌వేరింది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం సింగ‌పూర్‌లోని మ్యూజియంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మైనపు విగ్ర‌హాన్ని ఉంచ‌నున్న‌ట్టు తెలిపింది.

ఇప్ప‌టికే ఈ అమ్మ‌డి కొల‌త‌లు కూడా తీసుకోగా, ఫిబ్ర‌వ‌రి 5, 2020 నుండి ప్ర‌జ‌ల‌కి అందుబాటులోకి రానుంది. ఈ విష‌యం తెలుసుకున్న కాజ‌ల్ సంతోషం వ్య‌క్తం చేస్తుంది.

స్లైడ్ షో: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కాజల్


More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon