ఆర్బీఐ సమీక్ష.. వడ్డీ రేట్లు యధాతథం
హైదరాబాద్: ముంబైలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది.
కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచారు.
ప్రస్తుతం 5.1గా ఉన్న రెపో రేటును మార్చలేదు.
రివర్స్ రెపో రేటు 4.90గా ఉన్నది. బ్యాంకు రేటు 5.40శాతంగా ఉన్నది.
2019-20 సంవత్సరానికి జీడీపీ అంచనాలను తగ్గించారు.
6.1 శాతం నుంచి 5 శాతానికి జీడీపీ అంచనా తగ్గిస్తున్నట్లు మానిటరీ పాలసీ కమిటీ చెప్పింది.
ద్రవ్యోల్బణం 3.7 శాతంగా అంచనా వేశారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.