ఎర్రకోటకు పోటెత్తిన ఆందోళనకారులు.. వీడియో
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు ఢిల్లీలోని ఎర్రకోటకు భారీగా చేరుకుంటున్నారు. మండీ హౌజ్ నుంచి జంతర్ మంతర్ వరకు కమ్యూనిస్టు పార్టీ ఇవాళ భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చింది.
ఆ నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఎర్రకోట చేరుకుంటున్నారు. అక్కడ 144వ సెక్షన్‌ను విధించారు. అయినా నిరసనకారులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. పోలీసులు ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు.
పౌరచట్టానికి వ్యతిరేకంగా బెంగుళూరులో చరిత్రకారుడు రామచంద్ర గుహ నిరసన ప్రదర్శన చేపట్టారు. టౌన్‌హాల్ వద్ద జరిగిన ప్రదర్శనలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోనూ చార్మినార్ వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.#WATCH Large number of protesters in Delhi's Red Fort area where Section 144 has been imposed. #CitizenshipAct pic.twitter.com/tH5j4dJjTZ
— ANI (@ANI) December 19, 2019