మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

V6 Velugu లోగో V6 Velugu 18-12-19 Velugu

సినీ నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేశారు ఆర్టీఏ అధికారులు. గత నెల 13న ఔటర్‌ రింగ్‌ రోడ్డు గోల్కొండ దగ్గర ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది.

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటూ రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని టోలీచౌకీ ఆర్టీఏ అధికారులకు శంషాబాద్ పోలీసులు లేఖ రాశారు.

© V6 Velugu ద్వారా అందించబడింది

దీంతో వారు ఈ ఏడాది నవంబరు 29 నుంచి వచ్చే ఏడాది మే 20 వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే రాజశేఖర్ డ్రైవింగ్ లెసెన్స్ గడువు 2017 లోనే ముగిసింది. దీంతో పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతుండటంతో ఆయనపై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.

రాజశేఖర్ వాహనంపై ఏడాదిలో 21 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్టు తేలింది. వీటిలో 19 పరిమితికి మించిన వేగానికి సంబంధించినవే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

The post నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు appeared first on V6 Velugu.

More from V6 Velugu

V6 Velugu
V6 Velugu
image beaconimage beaconimage beacon