మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 17-12-19 Namasthe Telangaana

యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్డు మార్గాన యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరికాసేపట్లో యాదాద్రి ఆలయ నిర్మాణపనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు.

అలాగే ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను పరిశీలించి మహా సుదర్శనయాగం జరిగే ప్రాంతాన్ని గుర్తిస్తారు. నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. కొండపై జరుగుతున్న పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారని, శిల్పులు తుదిమెరుగులు దిద్దుతున్న పనులను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

కొండకింద ప్రెసిడెన్షియల్ సూట్ పనులు, పెద్దగుట్టపై చేపట్టాల్సిన పనులపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon