మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

చూయింగ్‌గమ్‌ చెప్పిన చరిత్ర

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 19-12-19 Namasthe Telangaana

- ఆరువేల ఏండ్ల కిందటి మహిళ పూర్తి డీఎన్‌ఏ లభ్యం

కోపెన్‌హాగన్‌: కొన్నిసార్లు చిన్న వస్తువులే వేల ఏండ్లకిందటి చరిత్రను విడమర్చి చెప్తాయి. ఇలాంటి ఘటనే తాజాగా డెన్మార్క్‌లో వెలుగుచూసింది. శాస్త్రవేత్తలు చూయింగ్‌ గమ్‌ వంటి పదార్థం సహాయంతో దాదాపు ఆరువేల ఏండ్ల కిందట నియోలిథిక్‌ యుగంలో జీవించిన యువతి జన్యుక్రమాన్ని, అప్పట్లో ఆమె నోటిలో జీవించిన సూక్ష్మక్రిముల ఉనికి ని గుర్తించారు.

© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

క్రీ.పూ 10,000-4,500 ఏండ్ల మధ్య కాలాన్ని నియోలిథిక్‌ యుగంగా పిలుస్తుంటారు. డెన్మార్క్‌లోని లోలాండ్‌ ద్వీపంలో ఉన్న ఓ ఎండిపోయిన ఉప్పునీటి మడుగులో శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపగా.. రెండు సెం.మీ. పొడవున్న చూయింగ్‌ గమ్‌ వంటి పదార్థం లభించింది. దీనిని ‘బిర్చ్‌' చెట్టు (కొండరావి చెట్టు వంటిది) నుంచి తయారుచేసినట్టు గుర్తించారు. ఈ చెట్ల బెరడును కాల్చి, ఆ బూడిదను వివిధ ప్రక్రియల ద్వారా పేస్ట్‌ మాదిరిగా తయారుచేస్తారు. దీని ని ‘బిర్చ్‌ టార్‌' అని పిలుస్తారు. వేల ఏండ్లుగా దీనిని గమ్‌ మాదిరిగా అంటించేందుకు వినియోగిస్తున్నారు. లోలాండ్‌ ద్వీపంలో దొరికిన బిర్చ్‌ టార్‌ను కోపెన్‌హాగన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశీలించి అందులో మానవ డీఎన్‌ఏ ఉన్నట్టు గుర్తించారు.

Woman1 © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది Woman1

దానిని విశ్లేషించగా పూర్తి జన్యుక్రమం బయటపడింది. దాదాపు 5,600 ఏండ్ల కిందట జీవించిన ఒక మహిళ దానిని చూయింగ్‌గమ్‌లాగా నమిలి ఊసినట్టు నిర్ధారించారు. ఆమెకు నల్లని చర్మం, నల్లని కురులు, నీలంరంగు కండ్లు ఉన్నట్టు వెల్లడైం ది. బిర్చ్‌ టార్‌ను మరింత విశ్లేషించగా.. అప్పట్లో ఆ మహిళ నోటిలో న్యుమోనియాను కలిగించే స్ట్రెప్టోకోకస్‌ న్యుమోనియే, లింఫ్‌ గ్రంథుల్లో వాపు, జ్వరం కలిగించే ఎప్‌స్టెన్‌ బార్‌ వైరస్‌ వంటి సూక్ష్మజీవులు ఉన్నట్టు గుర్తించారు.

ఇదే ప్రాంతంలో దొరికిన ఇతర జంతువుల అవశేషాల్లో 40 రకాల సూక్ష్మజీవు ల ఆనవాళ్లను గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన థెసిస్‌ జేన్సన్‌, హాన్నెస్‌ స్క్రుయేడర్‌ తెలిపారు. బిర్చ్‌ టార్‌ ను చూయింగ్‌ గమ్‌గా కూడా వాడేవారని ఇప్పుడే తెలి సిందన్నారు. వీరి పరిశోధన వ్యాసం నేచర్‌ కమ్యూనికేషన్స్‌ లో ప్రచురితమైంది.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon