మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ముషారఫ్‌కు పాక్‌ ప్రభుత్వం అండ

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 19-12-19 Namasthe Telangaana

ఇస్లామాబాద్‌: మరణశిక్ష పడిన పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు పాక్‌ ప్రభుత్వం మద్దతు తెలిపింది.

ఇప్పటికే సైన్యం ఆయనకు మరణశిక్ష విధించడాన్ని బహిరంగంగా వ్యతిరేకించగా, తాజాగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం సైతం అండగా నిలిచింది.

జెనీవా నుంచి తిరిగివచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం అత్యవసరంగా తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ పార్టీ కోర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ముషారఫ్‌కు విధించిన మరణశిక్షపై చర్చించారని జియో న్యూస్‌ వెల్లడించింది.

ముషారఫ్‌కు అన్యాయంగా మరణశిక్ష విధించారని, ఈ మేరకు కోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలని నిర్ణయించినట్టు తెలిపింది.

2013 నాటి దేశద్రోహం కేసులో ముషారఫ్‌కు పాక్‌ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon