ఐపీఎల్ ఖరీదైన ప్లేయర్ కమిన్స్.. ఎవరు కొన్నారో తెలుసా
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ దుమ్మురేపాడు. ఈసారి వేలంలో అత్యధిక ధర పలికి ఆటగాళ్లలో తనొక్కడిగా నిలిచాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన అతనికి అత్యంత భారీ ధర పలికింది. రూ.15.50 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తనను కొనుగోలు చేసింది.
నిఖార్సైనా పేసర్ కమిన్స్ దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చాలా ఆసక్తి చూపించాయి. చివరకు కోల్‌కతా తనను దక్కించుకుంది. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కమిన్స్ కోసం గట్టి పోటీనిచ్చింది.
దీంతో తొలుత తన దేశానికే చెందిన గ్లెన్ మ్యాక్స్ సాధించిన రూ.10.75 కోట్లను దాటని కమిన్స్.. ఆఖరివరకు పోరాడి కోల్‌కతా కైవసం చేసుకుంది. కమిన్స్ రాకతో తమ పేస్ దళం పటిష్టపడనుందని టీమ్ మేనేజ్‌మెంట్ ఇంత భారీ ధర వెచ్చించినట్లు తెలుస్తోంది.