మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ఐపీఎల్ వేలంలో 15 ఏళ్ల చిచ్చరపిడుగు

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 13-12-19

ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అఫ్గానిస్తాన్‌కు చెందిన 15 ఏళ్ల నూర్ అహ్మద్‌కు చోటు దక్కింది. ఐపీఎల్ వేలం ఈనెల 19న కోల్‌కతాలో జరుగుతుంది. ఈ వేలానికి గాను దాదాపు 900లకుపైగా ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. అందులో కేవలం 332 మంది మాత్రమే మిగిలారు.

© తెలుగు సమయం ద్వారా అందించబడింది

అందులో 15 ఏల్ల నూర్‌కు చోటు దక్కడం విశేషం. తను రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రానున్నాడు.

Read Also:IPLలో ఆ ముగ్గురిపై Rajasthan Royals కన్ను

© తెలుగు సమయం ద్వారా అందించబడింది

ఇటీవల భారత అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో నూర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆ సిరీస్‌లో అఫ్గాన్ 2-3తో ఓడిపోయినా నూర్ ప్రదర్శన ఆకట్టుకుంది.

లెఫ్టార్మ్ చైనామన్ బౌలరైన నూర్ ఈ సిరీస్‌లో తొమ్మిది వికెట్లతో సత్తాచాటాడు. అపార ప్రతిభ ఉన్న నూర్‌లాంటి ఆటగాళ్లను ఐపీఎల్ వేదికగా మారడం గతంలో ఎన్నోసార్లు చూశాం.

ఈక్రమంలో ఈసారి తనను దక్కించుకునేందుకు ఐపీఎల్ జట్లు ప్రయత్నించే అవకాశాలున్నాయి.

Read Also: ధోనీ..ధోనీ అంటూ ఫ్యాన్స్ అరుపులు.. విరాట్ కోహ్లీ ఆగ్రహం

ఇక వేలానికి అర్హత సాధించిన 332 మంది ఆటగాళ్లలో 186 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు 143 మంది విదేశీప్లేయర్లు కాగా, ముగ్గురు ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన వారు. ఇక అఫ్గాన్ నుంచి నూర్‌తో సహా ఏడుగురు ఐపీఎల్ వేలంలో చోటు దక్కించుకున్నారు.

వారిలో మహ్మద్ షెజాద్, జహీర్ ఖాన్, కరీమ్ జనత్, వకార్ సలామ్ ఖెయిల్, ఖాయిస్ అహ్మద్, నవీనుల్ హక్ ఉన్నారు. గతంలో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్రహ్మన్ లాంటి అఫ్గాన్‌లు ఐపీఎల్‌లో సత్తాచాటిన సంగతి తెలిసిందే వారి దారిలోనే నూర్ కూడా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు.

స్లైడ్ షో: భర్త బౌలర్, భార్య బ్యాట్స్‌విమెన్


More from Telugu Samayam

image beaconimage beaconimage beacon