మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

నా కూతురుకు ఏమీ తెలియ‌దు : సౌర‌వ్ గంగూలీ

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 19-12-19 Namasthe Telangaana

హైద‌రాబాద్‌: పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ కుమార్తె స‌నా గంగూలీ వివాదంలో ఇర‌క్కుకున్నారు.

© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

18 ఏళ్ల స‌నా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుపై సౌర‌వ్ స్పందించారు. ఇన్‌స్టాలో త‌న‌ కూతురు చేసిన పోస్టు నిజ‌మైంది కాదు అని గంగూలీ తెలిపారు.

స‌నా ఇన్‌స్టా అకౌంట్‌కు చెందిన ఓ స్నాప్‌షాట్ బుధ‌వారం వైర‌ల్‌గా మారింది. దీంతో సౌర‌వ్ రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. ఆ వైర‌ల్ ఫోటో నిజం కాద‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు స్పష్టం చేశారు.

కుశ్వంత్ సింగ్ పుస్త‌కంలోని ఓ వ్యాఖ్యాన్ని ప్ర‌స్తావిస్తూ.. స‌నా త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది. ఆ కామెంట్ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉన్న‌ది.

ద ఎండ్ ఆఫ్ ఇండియా అన్న పుస్త‌కంలో ఉన్న వ్యాఖ్యాన్ని ఆమె ప్ర‌స్తావించింది. అయితే కూతురు చేసిన పొర‌పాటు స‌రిదిద్ధే క్ర‌మంలో గంగూలీ అప్ర‌మ‌త్త‌త ప్ర‌ద‌ర్శించారు.

స‌నాను ఈ వివాదాల నుంచి దూరం ఉంచండి, ఇది నిజ‌మైన పోస్టు కాదు, రాజ‌కీయాల గురించి ఆమెకు తెలిసే వ‌య‌సు కాద‌ని, స‌నాను వ‌దిలేయండి అంటూ సౌర‌వ్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశాడు.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా బెంగాల్‌లో భారీ ఎత్తున్న ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon