మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

పానీపూరి టు కరోడ్‌పతి

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 20-12-19 Namasthe Telangaana

క్రికెట్‌ ఆడేందుకు ఒకప్పుడు పానీపూరి అమ్ముకొని జీవనం సాగించిన యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ శ్రమకు ప్రతిఫలం దక్కింది.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ 17ఏండ్ల సంచలన బ్యాట్స్‌మన్‌ను ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.2.40కోట్లకు సొంతం చేసుకుంది.

Yashasvi © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది Yashasvi

ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా, పంజాబ్‌ జట్లు కూడా తీవ్రంగా ప్రయత్నించగా చివరికి యశస్విని రాజస్థాన్‌ దక్కించుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన జైస్వాల్‌ క్రికెట్‌పై ఇష్టంతో 11ఏండ్ల వయసులోనే ఇంట్లో నుంచి వచ్చేసి ముంబైలో ఓ టెంట్‌లో ఏండ్ల తరబడి తలదాచుకున్నాడు.

జీవనం కోసం పానీపూరీ అమ్మడంతో పాటు అనేక పనులు చేశాడు. అదే క్రమంలో ముంబైలోని ఆజాద్‌ మైదానంలో క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ వివిధ టోర్నీల్లో సత్తాచాటాడు.

క్రమంగా ఎదుగుతూ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబై తరఫున 154 బంతుల్లోనే డజను సిక్సర్ల సాయంతో అలవోకగా ద్విశతకం బాదాడు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ సీజన్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 112బ్యాటింగ్‌ సగటుతో అతడు 564 పరుగులు చేశాడు.

వచ్చే ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో జరిగే అండర్‌-19 ప్రపంచకప్‌కు యశస్వి జైస్వాల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ‘

’చాలా ఆనందంగా ఉంది. రాజస్థాన్‌ ద్వారా ఎంత వీలైతే అంత నేర్చుకోవాలనుకుంటున్నా’ జైస్వాల్‌ అన్నాడు.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon