మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

అక్కడ వంద కోట్ల వసూళ్లతో సత్తా చాటనున్న పుష్ప...

News18 తెలుగు లోగో News18 తెలుగు 25-01-22 News18 Telugu
"అక్కడ వంద కోట్ల వసూళ్లతో సత్తా చాటనున్న పుష్ప..." © News18 తెలుగు ద్వారా అందించబడింది "అక్కడ వంద కోట్ల వసూళ్లతో సత్తా చాటనున్న పుష్ప..."

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు మిగితా భాషలతో పోల్చితే హిందీలో మరింత క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ అందుకోనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఈ చిత్రం 95 కోట్ల మేర వసూళ్లను అందుకోగా ఇంకొన్ని రోజుల్లో 100 కోట్ల మార్క్ ని అందుకుంటుంది హిందీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి స్పష్టం అయ్యిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. పుష్ప ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు బిహార్‌లో మంచి వసూళ్లను రాబట్టింది. పుష్ప సినిమా అన్ని భాషాల్లో కలిపి 300 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది.

ఇక మరోవైపు ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో సంచలనం సృష్టించాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓ రేంజ్‌లో వ్యూస్ దక్కాయి. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ అన్ని సౌత్ భాషల్లో కలిపి వన్ బిలియన్ ప్లస్ వ్యూస్‌ని టచ్ చేసిందని తెలుస్తోంది. దీంతో చిత్రబృందం వన్ బిలియన్ వ్యూస్ టచ్ చేసినట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అన్ని అంచనాలు తగ్గట్టే సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టించింది. అంతేకాదు ఈ చిత్రం హిందీ వెర్షన్ నేపాల్ దేశంలో రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. నేపాల్‌లో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. పుష్ప 146 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగగా.. ఈ సినిమా ఇప్పటి వరకు 24 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్‌ అదరగొట్టారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) శ్రీవల్లి పాత్రలో మైమరిపించారు.

Ananya Panday: చాక్లెట్ కలర్ టాప్‌లో పరువాల విందు చేసిన అనన్య పాండే..

పుష్పలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

More from News18 Telugu

image beaconimage beaconimage beacon