మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

Balakrishna: టాలీవుడ్ నిర్మాతలకు బాలకృష్ణ దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు నష్టనివారణ చర్యలు!

Zee Hindustan తెలుగు లోగో Zee Hindustan తెలుగు 09-08-22 Zee Hindustan తెలుగు

Producers Guild Forms a Committee to Stop Balakrishna: సినీ నిర్మాతలకు నందమూరి బాలకృష్ణ షాక్ ఇచ్చారు. ఆయన దెబ్బకు ఇప్పుడు నిర్మాతల గిల్డ్ ఒక కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 

© Zee Hindustan తెలుగు ద్వారా అందించబడింది

Producers Guild Forms a Committee to Stop Balakrishna: టాలీవుడ్ సినీ నిర్మాతలు అందరూ ప్రస్తుతానికి సినిమా షూటింగ్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. నిజానికి ముందుగా హీరోల రెమ్యూనరేషన్ లు భారీగా పెరిగిపోయాయని, అలాగే థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కారణాలతో షూటింగ్స్ నిలిపివేసినట్లు ప్రచారం జరిగింది. కానీ తర్వాత దిల్ రాజు నేతృత్వంలోని ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమకు నాలుగు సమస్యలు ఉన్నాయని ఆ నాలుగు సమస్యల మీద ఒక క్లారిటీ వస్తే అప్పుడు షూటింగ్స్ జరుపుతామని అనుమానాలు తొలగించే ప్రయత్నం చేశారు.

అయితే ఇప్పుడు నాలుగు సమస్యలకు గాను నాలుగు కమిటీలు ఏర్పాటు చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ గిల్డ్ నుంచి ఒక కొత్త కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీలో శివలెంక కృష్ణ ప్రసాద్, సాహు గారపాటి సహా మరో ముగ్గురు నిర్మాతలు ఉన్నారు. వీరు నందమూరి బాలకృష్ణను కలిసి అసలు షూటింగ్స్ ఎందుకు నిలిపివేశారు? సినిమా నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అనే విషయం మీద చర్చలు జరపబోతున్నట్లు సమాచారం.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న NBK 107 సినిమా షూటింగ్ ఆపడానికి నందమూరి బాలకృష్ణ నిరాకరించినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ ఎలాంటి బ్రేకులు లేకుండా కొనసాగించాలని బాలయ్య తన నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ మొదలు అందరు హీరోలు తమ దెబ్బకు షూటింగ్స్ నిలిపివేసినా ఇలా బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం నిర్మాతల మండలి సహా గిల్డ్‌కు మింగుడు పడలేదట. ఈ క్రమంలోనే బాలకృష్ణను ఒప్పించి సినిమా షూటింగ్‌ని ఆపడానికి సీనియర్ నిర్మాతలతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

సినిమా షూటింగ్‌లు నిలిచిపిపోవడానికి గల కారణాలను, దీర్ఘకాలంలో నిర్మాణ వ్యయాన్ని నియంత్రించాలనే డిమాండ్‌లను కమిటీ సభ్యులు ఆయనకు వివరించి షూట్ నిలిపేలా సహకరించమని కోరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్యను ఈ కమిటీ ఎంతవరకు ఒప్పించగలదో చూడాలి. బాలయ్య తన సినిమా షూటింగ్‌ని ఆపేస్తారా? లేక కంటిన్యూ చేస్తారో చూడాలి. అయితే నిజానికి సినిమా టికెట్ రేట్లు పెంచుకునే సమయంలో స్టార్ హీరోలను తీసుకువెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డితో నిర్మాతలు భేటీ అయ్యారు కానీ అప్పుడు బాలకృష్ణకు కనీసం సమాచారం ఇచ్చిన పాపాన కూడా పోలేదు. కానీ ఈరోజు నందమూరి బాలకృష్ణ షూటింగ్ దెబ్బకు కమిటీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది. 

Also Read: Mahesh Babu:మహేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. పవన్ ఎమోషనల్ నోట్!

Also Read: Taapsee Pannu: ఫోటోగ్రాఫర్లతో తాప్సీ పన్ను గొడవ.. చివర్లో ఎవరూ ఊహించని పని.. వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

More from  Zee Hindustan తెలుగు

image beaconimage beaconimage beacon