మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

Movie ticket prices : సినిమా టికెట్ల రేట్లను తగ్గించం..ఒమిక్రాన్‌ను ఎదుర్కొంటాం : మంత్రి తలసాని

Zee Hindustan తెలుగు లోగో Zee Hindustan తెలుగు 03-12-21 Zee Hindustan తెలుగు

Talasani clarifeis on movie ticket prices: కోవిడ్ కొత్త వేరియంట్ దృష్ట్యా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు విధించమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. కోవిడ్ వల్ల రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ ఒమిక్రాన్‌ (omicron) రావడం బాధకరమన్నారు. 

© Zee Hindustan తెలుగు ద్వారా అందించబడింది


Cinematography Minister Talasani Srinivas Yadav clarifies on movie ticket prices: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు తగ్గించమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Cinematography Minister Talasani Srinivas Yadav) స్పష్టతనిచ్చారు.

ఒమిక్రాన్‌ (omicron) నేపథ్యంలో థియేటర్లపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని భావించిన తెలుగు నిర్మాతలు, దర్శకులు... మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో దానయ్య, దిల్‌రాజు (Dilraju), త్రివిక్రమ్‌, (Trivikram) రాజమౌళి (Rajamouli) పలువురు హాజరయ్యారు. 

ప్రస్తుతం ఒమిక్రాన్‌ (omicron) దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని జరుగుతోన్న ప్రచారంపై అలాగే సినిమా టికెట్ల రేట్ల (Movie ticket rates) పెంపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వారు మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. 

అయితే కోవిడ్ కొత్త వేరియంట్ దృష్ట్యా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు విధించమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. కోవిడ్ వల్ల రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ ఒమిక్రాన్‌ (omicron) రావడం బాధకరమన్నారు. సినిమా హాళ్లలో కోవిడ్ నిబంధనలన్నింటినీ పాటించేలా చూడాలని నిర్మాతలకు సూచించామని చెప్పారు.

Also Read : Kangana Ranaut News: పంజాబ్ లోని రైతులు నా కారుపై దాడి చేశారు: కంగనా రనౌత్

ఇక సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని.. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ కొత్త వేరియంట్‌ను (Covid new variant‌) ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. సినీ పరిశ్రమకు సంబంధించి గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దర్శక, నిర్మాతలతో చర్చించినట్లు మంత్రి వివరించారు.

Also Read : IND vs NZ: అంపైర్ తప్పిదానికి బలి.. ఔట్ అయిన కోపంలో విరాట్ కోహ్లీ ఏంచేశాడంటే(వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More from  Zee Hindustan తెలుగు

image beaconimage beaconimage beacon