మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

Nutrition In Fish : చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...

News18 తెలుగు లోగో News18 తెలుగు 02-12-19 P18 Staff
© News18 Telugu ద్వారా అందించబడింది

చేపలు అనగానే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చెరువుల్లో చేపల్నే తింటారు. నిజానికి చెరువులతోపాటూ... సముద్ర చేపల్ని కూడా తినాలి. ఏ చేపలు తిన్నా... అవి బీపీని, కొలెస్ట్రాల్‌ని, డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తాయి. చేపల్లో కొవ్వు తక్కువ, నాణ్యమైన ప్రోటీన్స్ లభిస్తాయి. వారానికి రెండుసార్లైనా చేపను తినాలి.

తద్వారా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, డయాబెటిస్, బీపీ, మెదడు సంబంధింత సమస్యల నుంచీ బయటపడవచ్చు. తీర ప్రాంతాల్లో ప్రజలు చేపల్ని రెగ్యులర్‌గా తింటున్నారు. అందువల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా చేపల్ని తింటే... పుట్టే పిల్లలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు.

చేపల్ని ఎలాగైనా తినవచ్చు. వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బేకింగ్ చేసి తినవచ్చు. ఎంతో రుచికి తోడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చేపల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. మన శరీరంలో ప్రతీ కణానికీ ప్రోటీన్ అవసరమే. సరిపడా ప్రోటీన్స్ అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే శరీరంతోపాటూ రక్తం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చేపలు లభించని ప్రాంతాల్లో ప్రజలకు ప్రోటీన్స్ కొరత ఏర్పడుతోంది. 

© News18 Telugu ద్వారా అందించబడింది

మంచి కొవ్వు : చేపల్ని చూడాగానే చాలా మంది అమ్మో ఫ్యాట్ అంటూ భయపడతారు. నిజానికి చేపల్లో ఉండేది మంచి కొవ్వు. అది మన శరీరానికి చాలా అవసరం. చేపల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన గుండెను హార్ట్ ఎటాక్స్ నుంచీ కాపాడతాయి. ఇక ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో తయారవ్వవు. వాటిని చేపల్లాంటి వాటి ద్వారా పొందగలం. వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా, కడుపులో మంటలు, వేడి తగ్గాలన్నా చేపలు తినాలి. అర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి చేపలు సరైన మందు. ఇవి నొప్పిని తగ్గించి, కండరాలకు శక్తిని ఇస్తాయి. డిప్రెషన్, అల్జీమర్స్, డిమెన్షియా, మతిమరపు లాంటి లక్షణాల్ని చేపలు తగ్గిస్తాయి. ఎక్కువగా సాల్మన్, సార్డిన్స్, మాకెరెల్, ట్రౌట్, హెర్రింగ్, ట్యూనా చేపలు తింటే ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

ఎన్నో విటమిన్లు : ఎముకల్ని గట్టిగా చేసే విటమిన్-D చేపల్లో ఉంటుంది. రొమ్ము కాన్సర్, పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్, ఒయిసోఫాగస్ వంటి కాన్సర్లకు చేపలు చెక్ పెడతాయి. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిది. చేపల్లో విటమిన్ B2 రైబోఫ్లావిన్ కూడా ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో మేలుచేస్తుంది. బాడీ ఆక్సిజన్ తీసుకునేలా ఇది చేస్తుంది.

© News18 Telugu ద్వారా అందించబడింది

ఎన్నో ఖనిజాలు : - చేపల్లోని ఐరన్... రక్తంలోని హిమోగ్లోబిన్‌ సరిపడా ఉండేలా చేస్తుంది. పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేయగలదు. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఎనర్జీ ఉండాలంటే ఐరన్ కావాలి. అందుకోసం చేపలు తినాలి. - చేపల్లో ఉండే జింక్... వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. - చేపల్లోని అయోడిన్.... ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ మెదడు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సరిగా పనిచెయ్యడానికి, గాయిటర్ పాడవకుండా చెయ్యడానికీ చేపలు తినాలి. - చేపల్లోని మెగ్నీషియం... మన బాడీలో కూడా ఉంటుంది. అది సరిపడా లేకపోతే చాలా ఇబ్బంది. కాల్షియం మెటబాలిజంను సెట్ చెయ్యడానికి మెగ్నీషియం అవసరం. మీకు తెలుసు కాల్షియం వల్లే ఎముకలు బలంగా ఉంటాయని. కాల్షియంకి మెగ్నీషియం తోడైతే ఎంతో మేలు. - చేపల్లోని పొటాషియం... శరీరంలో ద్రవాలకు చాలా అవసరమైన పోషకం. కణాలు సమర్థంగా పనిచెయ్యడానికి పొటాషియం కావాలి. పొటాషియం తగ్గితే... హైబీపీ వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎముకలు పగలగలవు. యూరిన్‌లో కాల్షియం బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల పొటాషియం బాగా ఉండే చేపలు తినాలి.    

కోలీవుడ్‌ని శాసిస్తున్న ఢిల్లీ బ్యూటీ యషికా ఆనంద్

ఇవి కూడా చదవండి :Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...Health Tips : ముల్లంగి తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...Health : రోజూ 5 నిమిషాలు పరిగెడితే... కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealth Tips : డయాబెటిస్ లక్షణాలేంటి? ముందే గుర్తించడం ఎలా?Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి

More from News18 Telugu

image beaconimage beaconimage beacon