మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

Deafness : ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవు..

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 23-06-22
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

నేడు చాలా మంది ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారు. ఫోన్ మాట్లాడడం, పాటలు వినడం, వీడియోలు చూడడం.. ఇలా ఏవైనా సరే ఇయర్ ఫోన్స్ ‌ద్వారానే చేస్తున్నారు. దీని వల్ల వినికిడి సమస్యలు వస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ఓ నివేదిక ప్రకారం 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వాడుతుంటే.. ఇందులో దాదపు 50 శాతం మంది పెద్ద పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వింటున్నారు. దీని కారణంగా చెవుడు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అది కొన్ని సార్లు తాత్కాలికంగా ఉంటే మీరు వినే సమయం బట్టి శాశ్వతంగ కూడా చెవులు వినిపించే అవకాశాన్ని కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

92394415

చెవులకి ఎలా ప్రమాదం..

సాధారణంగా మనం వినే ద్వని చెవిలోపలికి చేరుకోవడానికి ఎముకల ద్వారాం వెళ్తుంది. అయితే వైబ్రేషన్ ద్వారా ఈ ధ్వని కోక్లియాకు చేరుతుంది. ఇది ద్రవంతో నిండి ఉంటుంది. అదే విధంగా చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉంటాయి. వైబ్రేషన్స్ కోక్లియాకి చేరుకోవడం ద్రవం అనేది కదిలి వెంట్రుకలని కదిలిస్తుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగితే జుట్టు కణాలు వాటి సున్నితత్వాన్నికోల్పోయి వంగడం, ముడతలు పడతాయి. దీంతో తాత్కాలికంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. సౌండ్ ఎక్కువగా ఉన్నప్పుడు.. చెవిలోని వినికిడి కణాలు దెబ్బతిని చెవిలోని గులిమిని లోపలికి పంపిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే.. ఈ కణాలు పునరుత్పత్తి చేసుకోలేవు. నష్టం జరిగినప్పుడు వాటిని తిరిగి రివర్స్ చేయలేం.

సమస్యకి పరిష్కారం..

ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు సౌండ్ తగ్గించండి. సాధారణంగా వాల్యూమ్‌ని డెసిబెల్స్‌తో కొలుస్తారు. సౌండ్ 60 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉంటే వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఇది ఎప్పుడైతే 85 దాటుతుందో.. అప్పుడే సమస్య ఏర్పడుతుంది. పరికరాలలో డెసిబెల్ అవుట్‌పుట్‌ను కొలవడం కష్టంగా ఉన్నప్పటికీ చెవులకి ఎలాంటి సమస్య రాకుండా సెట్టింగ్స్‌ని 50 శాతం ఉంచడం బెస్ట్ ఆప్షన్.

92389354

హెడ్ ఫోన్స్..

అయితే ఇయర్ ఫోన్స్‌తో కంపేర్ చేస్తే హెడ్‌ఫోన్స్ బెటర్ అనే చెప్పొచ్చు. వీటి రెండింటికీ తేడా తెలుసుగా.. ఇయర్ ఫోన్స్ చిన్నగా ఉండి చెవిలోకి వెళ్ళిపోతాయి. హెడ్ ఫోన్స్ పెద్దగా ఉండి చెవులని కప్పి ఉంటటాయి. హెడ్ ఫోన్స్ ఇయర్ కెనాల్‌ నుంచి కర్ణభేరి మధ్య దూరాన్ని పెంచుతాయి..

బ్రేక్ తీసుకోండి..

ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వాడితే సమస్యలు వస్తాయి. కాబట్టి.. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల చెవులకి కాస్తా రిలీఫ్‌గా ఉంటుంది. ప్రతి 30 నిమిషాలకి ఓ 5 నిమిషాలు, లేదా గంటకి 10 నిమిషాల బ్రేక్ తీసుకోవడం మంచిది.

92395308

చివరిగా..

ఇయర్ ఫోన్స్ వాడుతున్నప్పుడు పైన చెప్పిన జాగ్రత్తలన్నీ పాంచడం ముఖ్యం. అదే విధంగా వేరే వ్యక్తుల ఇయర్ ఫోన్స్ వాడకపోవడమే మంచిది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు నివారించొచ్చు. అదే విధంగా రోజూ వీటిని శానిటైజ్ చేస్తుండాలి.

గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon