మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ఏపీలో మహిళలకు శుభవార్త.. ఒక్కో అకౌంట్‌లో రూ.18,750!

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 23-09-22
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

ఏపీలో మహిళలకు శుభవార్త.. నేడు వైఎస్సార్ చేయూత పథకం (Ysr Cheyutha Scheme) డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేస్తోంది. వైఎస్సార్‌ చేయూత పథకం కింద చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా అకౌంట్‌లలో జమ చేయనున్నారు. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ చేయూత కింద సాయాన్ని అందజేస్తున్నారు. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు అందించారు. మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున అందించారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా అందించిన నిధులతో మహిళలు చిన్న వ్యాపారాలు, ఇతర అవసరాలకు, ఉపాధి కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. అంతేకాదు ప్రతి మండలానికి ఒక వైఎస్సార్‌ చేయూత మహిళా మార్ట్‌ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందిస్తున్నారు. కొంతమంది కిరాణా షాపులు నడుపుకుంటున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు. అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ చేయూత మూడో విడత నగదు జమ చేస్తారు అనంతరం.. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభిస్తారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి.. రేణిగుంట మీదుగా 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. ఇక్కడ కార్యక్రమాల అనంతరం తిరిగి మధ్యాహ్నం 3.10 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఎలాంటి వరాలు కురిపిస్తారన్నది చూడాలి.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon