మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

టీడీపీ ఎమ్మెల్సీలకు షాకిచ్చిన కేంద్రం

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 18-02-20
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్రం షాకిచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా మిగిలిన మంత్రులు అపాయింట్‌మెంట్ దొరకలేదు. కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అపాయింట్‌మెంట్ మాత్రమే ఖాయమైంది. దీంతో ఎమ్మెల్సీలు తమ హస్తిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Read Also: జగన్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆయనకు లైన్ క్లియర్?

టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళదామనుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటూ మరికొందరు కేంద్రమంత్రుల్ని కలవాలని భావించారు. టీడీపీ ఎమ్మెల్సీలు రెండు రోజుల పాటూ ఢిల్లీలోనే ఉండాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.

హస్తిన టూర్‌లో ఎమ్మెల్సీలు శాసనమండలి రద్దు బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, హోంమంత్రిలకు వివరించాలని భావిస్తున్నారు. అలాగే రాజధాని ఉద్యమం, అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు.

గతవారమే ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్‌లను కలిశారు. శానసమండలి రద్దు, సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లు అంశంపై చర్చించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే శాసనమండలి రద్దు బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు. ఆయన కేంద్ర పెద్దల్ని కలిసిన నాలుగు రోజులకే టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనకు సిద్ధంకాగా.. కేంద్రం మాత్రం షాకిచ్చిందనే చెప్పాలి.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon