మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

తిరుమలలో ఇక గాజు వాటర్ బాటిల్సే వాడాలి

V6 Velugu లోగో V6 Velugu 18-02-20 velugu

తిరుమలలో తాగునీటి కోసం భక్తులకు గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. రేపటి ఈ గాజు సీసాలను  భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడి ఆరోగ్య శాఖా అధికారి‌ ఆర్ఆర్ రెడ్డి తెలిపారు.

© V6 Velugu ద్వారా అందించబడింది

తిరుమలలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో గాజు వాటర్ బాటిల్ మోడల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన… 750 మి.లి గల ఒక గాజు బాటిల్ ధర రూ. 20 చెప్పారు. వాటర్ తాగిన తర్వాత ఖాళీ గాజు బాటిల్ ను తిరిగి దుకాణ దారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

ఒక వేళ  గాజు సీసా కావాలంటే మరో రూ. 20 అదనంగా దుకాణదారులకు చెల్లించాలన్నారు. గాజు బాటిల్స్ కు మంచి ఆదరణ లభిస్తే వాటినే కొనసాగిస్తామన్నారు.

దీంతో పాటు ఈ నెల 19 నుంచి ఖాళీ రాగి, మట్టి వాటర్ బాటిల్స్ కూడా భక్తులకు  అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

The post తిరుమలలో ఇక గాజు వాటర్ బాటిల్సే వాడాలి appeared first on V6 Velugu.

More from V6 Velugu

V6 Velugu
V6 Velugu
image beaconimage beaconimage beacon