మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

విశాఖలో మరోసారి గ్యాస్ లీకేజీ.. ఇద్దరు మృతి

News18 తెలుగు లోగో News18 తెలుగు 2 రోజుల క్రితం P18 Staff
"విశాఖలో మరోసారి గ్యాస్ లీకేజీ.. ఇద్దరు మృతి" © News18 తెలుగు ద్వారా అందించబడింది "విశాఖలో మరోసారి గ్యాస్ లీకేజీ.. ఇద్దరు మృతి"

విశాఖలోని మరో కంపెనీ నుంచి గ్యాస్ లీకేజీ జరిగింది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్‌లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద రావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఘటనకు గురించి సమాచారం వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా అక్కడి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తుస్తున్నారు. ప్రమాద ఘటనపై నలుగురు అధికారులతో కమిటీని నియమించారు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. మరోవైపు ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

More from News18 Telugu

image beaconimage beaconimage beacon