మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

కాంగ్రెస్‌కు 100 మంది ఎంపీలు కూడా లేరు: ప‌్ర‌ధాని మోదీ

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 03-11-20 Namasthe Telangaana

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధాని మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.  ఆ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర నిరాశ‌తో ఉన్న‌ట్లు ఆయ‌న అన్నారు.  అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆ పార్టీని దేశ ప్ర‌జ‌లు శిక్షిస్తూనే ఉన్నార‌న్నారు. 

కాంగ్రెస్‌కు 100 మంది ఎంపీలు కూడా లేరు: ప‌్ర‌ధాని మోదీ © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది కాంగ్రెస్‌కు 100 మంది ఎంపీలు కూడా లేరు: ప‌్ర‌ధాని మోదీ

పార్ల‌మెంట్‌లో క‌నీసం ఆ పార్టీ ఖాతాలో వంద మంది ఎంపీలు కూడా లేర‌న్నారు.  బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ..  లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు క‌లిపినా.. కాంగ్రెస్ ఎంపీల సంఖ్య వంద దాట‌ద‌న్నారు.  దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుతున్న‌ట్లు ఆయ‌న అన్నారు.  ప్ర‌జ‌ల్ని ఇంకా మ‌భ్య‌పెట్ట‌లేర‌ని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అంద‌రికీ తెలుసు అని, ప్ర‌జ‌లే ఆ పార్టీని శిక్షించార‌న్నారు. 

కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు ఇంకా శిక్షిస్తూనే ఉన్నార‌‌ని, అందుకే అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ నుంచి ఒక్క ఎంపీ కూడా గెల‌వ‌లేద‌ని ప్ర‌ధాని విమ‌ర్శించారు. అర‌రియా జిల్లాలోని ఫోర్బ్స్ గంజ్‌లో జ‌రిగిన స‌భ‌లో మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో స్వార్థం పెరిగింద‌ని,  ప్ర‌జ‌ల సొమ్మును వాళ్లు దోచుకున్న‌ట్లు ఆరోపించారు. 

కానీ బీహార్‌, దేశ ప్ర‌జ‌లు ఇప్పుడు ఆ వాస్త‌వాల‌ను గ‌మ‌నించార‌ని, అందుకే ప‌దేప‌దే అబ‌ద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు ఓడించార‌న్నారు. మాట‌లు చెప్పి, ప్ర‌జ‌లు అల‌సిపోయేలా చేశార‌న్నారు.  

  

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon