మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ఈ నెల 26న వస్తున్న "గీత"

V6 Velugu లోగో V6 Velugu 14-08-22 V6 Velugu
ఈ నెల 26న వస్తున్న "గీత" Caption of Image. © V6 Velugu ద్వారా అందించబడింది Caption of Image.

సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ ప్రియ శిష్యుడు "విశ్వ"ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ ఆశీస్సులతో "గ్రాండ్ మూవీస్" పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం "గీత". "మ్యూట్ విట్నెస్" అన్నది ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు.

© V6 Velugu ద్వారా అందించబడింది

 ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. "ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ ఇప్పించారు. నిర్మాత రాచయ్యకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ.. "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ "గీత" చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.

© V6 Velugu ద్వారా అందించబడింది

రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, డాన్స్: అనీష్, పాటలు : సాగర్, సంగీతం : సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఎస్.చిన్నా, పోరాటాలు : రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం : క్రాంతికుమార్.కె, కూర్పు : ఉపేంద్ర, కో-డైరెక్టర్ : వి.వి.రమణ, నిర్మాత : ఆర్.రాచయ్య, కథ,- స్క్రీన్ ప్లే, -దర్శకత్వం: విశ్వ

©️ VIL Media Pvt Ltd.

More from V6 Velugu

image beaconimage beaconimage beacon