మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ఎన్టీఆర్ శ‌త జయంతి సంద‌ర్భంగా NBK 107 మరో లుక్ పోస్టర్.. కత్తి పట్టిన బాలయ్య

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 28-05-22
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

నంద‌మూరి నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి నేడు (మే 28). ఆయ‌న శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌ట వార‌సుడు నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రంనుంచి కొత్త పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కత్తి పట్టుకుని బాలయ్య మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఇది ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయమే.గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమాలో బాల‌కృష్ణ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. మాస్ లుక్‌లో బాల‌య్య గెట‌ప్ అంద‌రినీ మెప్పించింది. దీంతో సినిమాకు ఎలాంటి ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను పెడ‌తారోన‌ని అందరిలో తెలియ‌ని ఆస‌క్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని NBK 107 టైటిల్ ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి జై బాలయ్య, అన్నగారు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని టాక్.

NBK 107లో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యంలో క‌నిపించ‌బోతున్నారు. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. క్రాక్ వంటి సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ త‌ర్వాత గోపీచంద్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిదే. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు బాల‌కృష్ణ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు క‌థ‌ను డిజైన్ చేసిన‌ట్టు ఓ సంద‌ర్భంలో తెలియ‌జేశారు.

ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ తదుప‌రి చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన చర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్లో బాల‌కృష్ణ 108వ సినిమా ప్రారంభం అవుతుంది. గ‌త ఏడాది బాల‌కృష్ణ అఖండ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టారు. రూ.200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించిందీ చిత్రం. ఆ చిత్రం త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon