మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ఏలూరు వింత వ్యాధి వ్యవహారంలో ట్విస్ట్.. నెల క్రితమే, ఆ రెండే కారణమంటున్న బాధితులు

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 10-12-20
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వింత వ్యాధితో జనాలు వణికిపోతున్నారు. అస్వస్థతకు గురై వెంటనే కోలుకుంటున్నా.. స్థానికుల్ని భయం వదలడం లేదు. బాధితుల సంఖ్య బాగా తగ్గింది. బుధావరం వరకు 18 మంది మూర్ఛ, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొత్తగా కేసులేమీ రాలేదు. దీంతో మొత్తం సంఖ్య 587కి చేరింది. ఇందులో 511 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. 43 మంది ఏలూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం 33 మందిని విజయవాడ తరలించారు. కొత్తగా లంకపేట, ఆముదాల అప్పలస్వామి కాలనీ, భీమడోలు ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసు నమోదైంది.

ముందస్తు జాగ్రత్తగా నగరంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక లక్షణాలున్న బాధితులు, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారికి ఈ శిబిరాల్లోనే ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. బాధితుల సంఖ్య తగ్గినా ఆస్పత్రిలో పడకలు, అంబులెన్సులు, వైద్యశిబిరాలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.అనుమానిత లక్షణాలు ఉన్నవారిని ఇంటింటి సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. కలెక్టర్ సహా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు.

మరోవైపు ఈ వింత వ్యాధికి సంబందించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఏలూరులోని దక్షిణ వీధి, తంగెళ్లమూడి, ఆర్‌ఆర్‌పేట ప్రాంతాల్లో దీపావళికి ముందు నుంచే ఇలాంటి లక్షణాలతో కేసులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కళ్లు తిరగడం, తలనొప్పి వంటి లక్షణాలతో కొందరు ప్రైవేటు వైద్యుల వద్దకు వచ్చారు. దక్షిణవీధిలో రోజుకు ఒకరిద్దరు వచ్చినట్లు చెబుతున్నారు. పాలు కారణమని కొందరు టీ తాగడం మానేశారట.. ఈ వ్యాధి బయటపడినప్పటి నుంచి శుద్ధిచేసిన మంచినీటికి గిరాకీ పెరిగిందట. ఇంతకుముందు రోజూ 5 క్యాన్లు అమ్మే వ్యాపారులు ఇప్పుడు 15 వరకు అమ్ముడు పోతున్నాయట. నీళ్లు, పాల వల్లే ఇలా జరుగుతుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon