మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

చలిగుప్పిట గిన్నెధరి

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 10-12-20 Namasthe Telangaana
చలిగుప్పిట గిన్నెధరి © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది చలిగుప్పిట గిన్నెధరి
  • 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
  • గత పదేండ్లలో రెండోవారంలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డు
  • మరింత పెరుగనున్న చలి తీవ్రత

హైదరాబాద్‌/కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ:  రాష్ట్రంలో చలి వణికిస్తున్నది. తూర్పు దిశనుంచి వీస్తున్న గాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో బుధవారం అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రికార్డుల ప్రకారం.. గత పదేండ్లలో డిసెంబర్‌ రెండోవారంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే 7.1 డిగ్రీలే అత్యల్పం. ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం డిసెంబర్‌ నెలలో అత్యల్పంగా 2017లో డిసెంబర్‌ 27న 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

డిసెంబర్‌ 20 తర్వాత కనిష్ఠ ఉష్ణోగ్రత కొన్నిసార్లు 8.5 డిగ్రీల వరకు తగ్గినప్పటికీ, 9వ తేదీనే 7.1 డిగ్రీలు నమోదుకావడం రికార్డని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురు, శుక్రవారాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పారు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో 8.9 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(ఆర్‌), ఆదిలాబాద్‌ జిల్లా బేల, బోథ్‌ మండలాల్లో 9.2 డిగ్రీల చొప్పున, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.8 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా పెంబిలో 10.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారంలో 10.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం కోల్వాయి, రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 10.7 డిగ్రీల చొప్పున నమోదైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, గ్రేటర్‌ పరిధిలోని రామచంద్రాపురంలో 11.8 డిగ్రీలుగా రికార్డయినట్టు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది.

వణుకుతున్న ఏజెన్సీ

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చలి పంజా విసిరింది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం తిర్యాణి మండలం గిన్నెధరిలో 7.1 డిగ్రీలుగా నమోదుకాగా, మున్ముందు చలి మరింత తగ్గే అవకాశాలుండటంతో అడవిబిడ్డలు వణికిపోతున్నారు. జిల్లాలో అడవులు అత్యధికంగా ఉండటం వల్ల మిగతా ప్రాంతాలకన్నా చలి ఎక్కువగా నమోదవుతున్నది. ఏజెన్సీ ప్రాంతాలు జైనూర్‌, సిర్పూర్‌, లింగాపూర్‌ ప్రాంతాల్లో చలి మరింత వణికిస్తున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఉదయం పొగమంచు కమ్ముకుంటున్నది.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon