మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

టీకా భాగ్యం

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 10-12-20 Namasthe Telangaana
టీకా భాగ్యం © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది టీకా భాగ్యం
  • కొవిడ్‌ వ్యాక్సిన్‌ పరిశోధన, తయారీ, 
  • ఉత్పత్తిపై హైదరాబాద్‌కు అభినందన
  • జీనోమ్‌వ్యాలీకి 64 దేశాల ప్రతినిధులు
  • భారత్‌ బయోటెక్‌, బీఈ ల్యాబ్‌ సందర్శన
  • రాష్ట్రంలోని ఫార్మారంగం విలువ 5వేల కోట్ల డాలర్లు
  • విదేశీ ప్రతినిధుల బృందంతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • 33% వ్యాక్సిన్ల ఉత్పత్తి హైదరాబాద్‌లోనే

ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో హైదరాబాద్‌ కీలకపాత్ర పోషించబోతున్నదని విదేశీ ప్రతినిధుల బృందం కొనియాడింది. హైదరాబాద్‌ ప్రపంచ టీకా కేంద్రమని ప్రశంసించింది. ప్రపంచానికి అవసరమయ్యే టీకాల్లో 33 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నది. మానవజాతికి మేలు చేయాలన్న తపన హైదరాబాద్‌లో కనిపించిందని వ్యాఖ్యానించింది. ఎన్నో దేశాలను ఆదుకోగలిగే శక్తి ఇక్కడి వ్యవస్థకు ఉన్నదని అభినందించింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాక్సిన్‌ టూర్‌లో భాగంగా 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం హైదరాబాద్‌లో పర్యటించింది. జీనోమ్‌వ్యాలీలోని ప్రముఖ ఫార్మా సంస్థలు భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ కంపెనీలను వారు సందర్శించారు. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. జీనోమ్‌వ్యాలీని సందర్శించడం గర్వంగా ఉన్నదని చెప్పారు. దేశంలో జరుగుతున్న వ్యాక్సిన్‌ పరిశోధనలను ప్రపంచానికి పరిచయం చేయడానికి కేంద్ర విదేశాంగశాఖ ఈ పర్యటనను ఏర్పాటుచేసింది. ముందుగా విదేశీ ప్రతినిధులు రెండు బృందాలుగా ఏర్పడి.. ఒక బృందం భారత్‌ బయోటెక్‌, రెండో బృందం బయోలాజికల్‌-ఈ సంస్థలను సందర్శించాయి. అనంతరం ఆయా బృందాలు రెండో సంస్థను సందర్శించాయి.  వ్యాక్సిన్‌ అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నాయి. టీకా తయారీ, ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించాయి. భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ పేరుతో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. బయోలాజికల్‌-ఈ సంస్థ టీకా అభివృద్ధికి అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డైనావాక్స్‌తో చేతులు కలిపింది. ఈ నెలలోనే మనుషులపై ప్రయోగాలు జరుగనున్నాయి. 

హైదరాబాద్‌ ఫార్మారంగ ఉత్పాదకత రూ.3.68 లక్షల కోట్లు

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక స్వాగత కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తక్కువ కాలంలోనే సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. సులభతర వాణిజ్య విధానంలో (ఈవోడీబీ) రాష్ట్రం గత ఆరేండ్లుగా దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌ మహానగరం భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉన్నదని, రోడ్డు, రైల్వే, విమాన వ్యవస్థలతో అద్భుతమైన కనెక్టివిటీ కలిగిఉన్నదని వెల్లడించారు. ఇన్ని అనుకూలతలు ఉండటం వల్లే ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలైన గూగుల్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను నెలకొల్పాయని చెప్పారు. ఆయా సంస్థలకు అమెరికా వెలుపల ఉన్న అతిపెద్ద క్యాంపస్‌లు ఇవేనని తెలిపారు. ఫార్మా రంగానికి రాష్ట్రం కేంద్రంగా ఉన్నదని, ఉత్పాదక విలువ రూ.3.68 లక్షల కోట్లు (50 బిలియన్‌ డాలర్లు) అని చెప్పారు. హైదరాబాద్‌ ప్రపంచ టీకా కేంద్రంగా విరాజిల్లుతున్నదని వెల్లడించారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ పేరుతో విప్లవాత్మక సంస్కరణ ప్రవేశపెట్టిందని తెలిపారు. 15 రోజుల్లో అధికారులు అనుమతి ఇవ్వకుంటే ఆటోమెటిక్‌గా అనుమతులు వచ్చేస్తాయని పేర్కొన్నారు. ఈ పాలసీ అద్భుత సంస్కరణగా నిలిచిందని, గత ఆరేండ్లలో రాష్ర్టానికి 14వేల పరిశ్రమలు వచ్చాయని వివరించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నదని, మరికొన్ని నెలల్లో దీనిని ప్రారంభిస్తామని చెప్పారు. దీంతోపాటు ఓఆర్‌ఆర్‌కు సమీపంలో రూ.500 కోట్లతో మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ర్టానికి ఉన్న ఆకర్షణలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 

కొవాగ్జిన్‌పై అంతర్జాతీయంగా ఆసక్తి

భారత్‌ బయోటెక్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా మాట్లాడారు. దేశంలో కరోనా టీకా కొవాగ్జిన్‌.. అభివృద్ధి, ఉత్పత్తిలో ఓ మైలురాయి అని చెప్పారు. కొవాగ్జిన్‌పై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొన్నదన్నారు. పలు దేశాలు కొవాగ్జిన్‌ను తమ ప్రజలకు అందించేందుకు, సరఫరా చేసేందుకు ముందుకొస్తున్నాయని వెల్లడించారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తున్నదని చెప్పడానికి విదేశీ దౌత్యవేత్తల పర్యటన నిదర్శనమన్నారు. కొవాగ్జిన్‌ ప్రాజెక్టు వివరాలను, భారత్‌ బయోటెక్‌ ప్రస్థానాన్ని సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా ప్రతినిధుల బృందానికి క్షుణ్ణంగా వివరించారు. ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి టీకాను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. బయోసేఫ్టీ లెవల్‌-3 ల్యాబ్‌లో వ్యాక్సిన్‌ పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. అత్యంత సురక్షితమైన పద్ధతిలో టీకాను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. ఏటా కోట్ల డోసులను ఉత్పత్తి చేసిన రికార్డు తమకు ఉన్నదన్నారు. తాము అనేక విదేశీ సంస్థలతో కలిసి ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. 

రెండు సంస్థలది గొప్ప ప్రయత్నం

కరోనా కట్టడిలో భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ గొప్పగా కృషి చేస్తున్నాయని విదేశీ ప్రతినిధుల బృందంలోని ఆస్ట్రేలియా హై కమిషనర్‌ బారీ ఓ ఫారెల్‌ ప్రశంసించారు. హైదరాబాద్‌కు వచ్చి రెండు సంస్థల్లో జరుగుతున్న వ్యాక్సిన్‌ పరిశోధనలు, టీకా అభివృద్ధి గురించి తెలుసుకోవడం గర్వంగా ఉన్నదని ట్వీట్‌ చేశారు. రెండు సంస్థల్లోనూ మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. హైదరాబాద్‌ ప్రపంచ టీకా కేంద్రంగా ఉన్నదని, ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విదేశాంగశాఖ అదనపు కార్యదర్శి వినయ్‌కుమార్‌,  ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి, బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమ దాట్ల తదితరులు పాల్గొన్నారు.  

మానవత్వానికి ముగ్ధుడినయ్యా

వ్యాక్సిన్‌ ప్రయోగాలను తిలకించేందుకు హైదరాబాద్‌కు రావడం సంతోషంగా అనిపించింది. కరోనాను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, సంస్థలు కంకణబద్ధులై ఉండటం, మానవజాతికి మేలు చేయాలన్న తపన ముగ్ధుడిని చేసింది. వారు ఇదేదో వ్యాపారం కోసమో, సొంత దేశం కోసమో చేయడం లేదు. విపత్తు అంచున ఉన్న ప్రపంచాన్ని, ప్రతి మనిషిని ఆదుకొనేందుకు శ్రమిస్తున్నారు.  

- ఎఫ్‌ స్వేన్‌, భారత్‌లో డెన్మార్క్‌ రాయబారి

కరోనా కట్టడికి హైదరాబాద్‌ సంస్థలు గొప్పగా కృషిచేస్తున్నాయి. ప్రపంచ టీకా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో  ప్రపంచానికవసరమయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం ఉత్పత్తి అవుతున్నాయి. హైదరాబాద్‌కు వచ్చి రెండు సంస్థల్లో జరుగుతున్న వ్యాక్సిన్‌ పరిశోధనలు, టీకా అభివృద్ధి గురించి తెలుసుకోవడం గర్వంగా ఉన్నది.

- బారీ ఒ ఫారెల్‌, ఆస్ట్రేలియా హై కమిషనర్‌

జనవరి నుంచే టీకా పంపిణీ! 

  • కసరత్తు చేస్తున్న వైద్యారోగ్యశాఖ 
  • ముందుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే

ప్రజలకు కరోనా టీకా వేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిద్ధమవుతున్నది. జనవరి నుంచి టీకా పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు ముందుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేయనున్నారు. వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు సుమారు 80లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తారని సమాచారం. ప్రతి ఒక్కరికీ రెండు డోసులు ఇవ్వా ల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కనీసం 1.60 కోట్ల టీకాలను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు నేతృత్వంలో టీకాల కార్యక్రమం జరుగనున్నది. ఒక్కసారి టీకా వేస్తే 9-12 నెలలపాటు రక్షణగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్‌ పంపిణీకి కార్యాచరణను సిద్ధం చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీకాలు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా వైద్యబృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా అందజేశాక వృ ద్ధు లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం 50 ఏండ్లు నిండినవారిని, దీర్ఘకాలిక వ్యాధులున్నవారిని గు ర్తించడానికి రెండు, మూడు వారాల్లో ఇంటి ంటి సర్వేచేయాలనిప్రభుత్వం నిర్ణయించిం ది. వ్యాక్సిన్‌  నిల్వ కోసం జిల్లాస్థాయిలో 33 స్టోరేజ్‌ సెంటర్లు, పీహెచ్‌సీస్థాయిలో 879 స్టోరేజ్‌ పాయింట్లను ఏ ర్పాటు చేసింది.రవాణాకు వాహనాలను సమకూర్చింది.

వ్యాక్సిన్‌ వేసేది ఇలా..

రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ వేసేందుకు  9,723 బూత్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వ్యాక్సిన్‌ వేయడానికి నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లను సిద్ధంచేసింది. ఒక్కో సెంటర్‌లో ఒక నర్సు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌ ఉంటారు. వీరికి తోడుగా స్వచ్ఛ ంద సంస్థల ప్రతినిధులూ పాల్గొంటారు. వీరందరికీ వా రంలో వ్యాక్సిన్‌ పంపిణీపై శిక్షణ ఇస్తారు.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon