మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

తారక్, చరణ్‌కు మించి రాజమౌళి డ్యాన్స్.. నాటు నాటుపై హార్ట్ ఫెల్ట్ నోట్

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 25-01-23
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR చిత్రం అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిసింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) సహా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ నుంచి అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం తాజాగా ఆస్కార్ 2023 (Oscars 2023) ఫైనల్ నామినేషన్స్‌లో చోటుచేసుకుంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు సాంగ్’ (Natu Natu Song) ఆస్కార్ కోసం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో షార్ట్ లిస్ట్ కాబడింది. దీంతో మూవీ టీమ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తుండగా.. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ట్విట్టర్ వేదికగా నోట్ షేర్ చేశాడు. తారక్ (NTR), చరణ్ (Ram Charan) కంటే తనే ఇప్పుడు నాటు నాటు పాటకు ఎక్కువ డ్యాన్స్ చేస్తున్నట్లు తెలిపాడు.

హార్ట్ ఫెల్ట్ నోట్ షేర్ చేసిన రాజమౌళి.. ‘నా సినిమాలో నా పెద్దన్న పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. నేను ఇంతకంటే ఎక్కువగా అడగలేను. ప్రస్తుతం తారక్, చరణ్‌ల కంటే నేనే నాటు నాటు పాటకు చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాను’ అన్నారు. తన జీవితంలో ఆస్కార్ గురించి కలలో కూడా ఊహించలేదని.. నాటు నాటుతో పాటు RRR మూవీ క్రేజీ ఫ్యాన్స్ ముందుగా దీన్ని విశ్వసించారని, వారి కారణంగా ప్రపంచ పర్యటనలతో ఈ పాటను తదుపరి స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు.

అలాగే ‘ఆస్కార్ స్టేజ్ మీద మన పాట’ అంటూ నోట్‌లో చంద్రబోస్‌కు ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి మాట్లాడుతూ.. ‘ప్రేమ్ మాస్టర్, ఈ పాటకు మీ సహకారం వెలకట్టలేనిది. నా వ్యక్తిగత ఆస్కార్ మీకే వస్తుంది’ అన్నారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌కు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజులు సంకోచించిన తర్వాత నాటు నాటు సాంగ్ విషయంలో ముందుకెళ్లడానికి భైరవ BGM తనను ప్రేరేపించినట్లు చెప్పిన జక్కన్న.. ‘లవ్ యూ భైరి బాబు.. రాహుల్, భైరవల సూపర్ ఎనర్జిటిక్ వోకల్స్ పాటను మరింత మెరుగుపరిచాయి’ అని పేర్కొన్నారు.

ఇంకా తన నోట్‌లో తారక్, చరణ్ గురించి మాట్లాడుతూ.. ‘దీనికి ప్రధాన కారణం తారక్, చరణ్‌‌ల సింక్, స్టైల్. వారు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్లి నృత్యం చేశారు.. హింసించినందుకు క్షమించండి. కానీ మళ్లీ చేయడానికి వెనుకాడను’ అంటూ ముగించాడు. అంతేకాదు అవిశ్రాంతంగా పనిచేసిన కార్తికేయ వల్లే ఇదంతా సాధ్యమైందన్న రాజమౌళి.. కార్తికేయ పట్ల గర్వంగా ఉందని వెల్లడించాడు. ప్రతి ఒక్కరికీ పాట రీచ్ అయ్యేలా 24 గంటలు పనిచేసిన ప్రదీప్, హర్ష, చైతన్యకు ఈ సందర్భంగా థాంక్స్ చెప్పారు.

Read Latest

Tollywood updates

and

Telugu News

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon