మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

ముంద‌స్తు ఓటేసిన భార‌తీయులు..

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 03-11-20 Namasthe Telangaana
ముంద‌స్తు ఓటేసిన భార‌తీయులు.. © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది ముంద‌స్తు ఓటేసిన భార‌తీయులు..

హైద‌రాబాద్: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ముంద‌స్తు ఓటింగ్ జోరుగా సాగింది.  దాదాపు 9.8 కోట్ల మంది ముంద‌స్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు.  అమెరికా ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనూ ఇదో రికార్డు.  అధ్య‌క్ష ఎన్నిక‌ల పోలింగ్ తేదీ రోజు క‌న్నా ముందే ఇంత భారీ సంఖ్య‌లో అమెరిక‌న్లు ఓటు వేయ‌డం ఇదే మొద‌టిసారి.  అయితే భార‌త సంత‌తి ఓట‌ర్లు కూడా ఈసారి అత్య‌ధిక సంఖ్య‌లో ముంద‌స్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు.  కోవిడ్ నేప‌థ్యంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంద‌ర్భంగా.. చాలా వ‌ర‌కు ఓట‌ర్లు ముందే ఓటేశారు. అబ్సెంట్ బ్యాలెట్‌గా పిలువ‌బ‌డే ముంద‌స్తు ఓటింగ్‌ అన్ని రాష్ట్రాల్లోనూ జ‌రిగింది.  ఇవాళ జ‌రిగే పోలింగ్‌లో ట్రంప్‌, బైడెన్ భ‌విత‌వ్యం తేల‌నున్న‌ది. 

సాధార‌ణంగా పూర్తి ఫ‌లితాలు రావాలంటే కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. కానీ పోలింగ్ జ‌రిగిన మ‌రుస‌టి రోజే దాదాపు విజేత ఎవ‌రో ఖాయం అవుతుంది. 2016లో పోలింగ్ జ‌రిగిన మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు డోనాల్డ్ ట్రంప్ విక్ట‌రీ ప్ర‌సంగం చేశారు.  అయితే ఈసారి పూర్తి ఫ‌లితాల ప్ర‌క‌ట‌న మాత్రం కొన్ని  రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  ఈసారి పోస్ట‌ల్ బ్యాలెట్ల సంఖ్య పెర‌గ‌డం వ‌ల్ల‌.. వాటి లెక్కింపు ఆల‌స్యం అవుతుంద‌ని అధికారులు ఇప్ప‌టికే వార్నింగ్ ఇచ్చారు. 2000 సంవ‌త్స‌రంలో విజేత ప్ర‌క‌టించేందుకు దాదాపు నెల రోజుల స‌మ‌యం ప‌ట్టింది.  వేరువేరు రాష్ట్రాలు వేరువేరు ప‌ద్ద‌తుల్లో లెక్కింపు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తాయి కాబ్ట‌టి.. వాటి ఫలితాల ప్ర‌క‌ట‌న‌ భిన్న స‌మ‌యాల్లో జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల తుది ప్ర‌క‌ట‌న ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.  కొన్ని రాష్ట్రాల్లో పూర్తి లెక్కింపు జ‌రిగేందుకు వారాల స‌మ‌యం ప‌డుతుంది. అయితే అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం మంగ‌ళ‌వారం రాత్రి త‌న విక్ట‌రీ సందేశాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు కొన్ని సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి.   

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon