మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే కలెక్షన్స్... దుమ్ములేపిన అఖిల్ అక్కినేని..

News18 తెలుగు లోగో News18 తెలుగు 16-10-21 News18 Telugu
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే కలెక్షన్స్... దుమ్ములేపిన అఖిల్ అక్కినేని.." © News18 తెలుగు ద్వారా అందించబడింది "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే కలెక్షన్స్... దుమ్ములేపిన అఖిల్ అక్కినేని.."

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందట. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే...

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ డే అంచనాలను మించి పోయే కలెక్షన్స్‌ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 5.45 కోట్ల రేంజ్ లో షేర్‌ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ నమోదు చేసింది.

అంతేకాదు వరల్డ్ వైడ్‌గాను అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంది. అమెరికాలో ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి $225K మార్క్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 6.8 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఏరియాల వారిగా సినిమా ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ ….

Nizam: 2.02Cr

Ceeded: 1.12Cr

UA: 61L

East: 34L

West: 30L

Guntur: 52L

Krishna: 31L

Nellore: 23L

AP-TG Total:- 5.45CR(9.1CR Gross)

Ka+ROI: 51L

OS – 84L

Total WW: 6.80CR(11.90CR Gross)

ఇక ఈ సినిమాను టోటల్ వరల్డ్ వైడ్‌గా 18.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 19 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 12.2 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్‌గా నిలుస్తుందని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయో..

Sekhar Kammula: రానాకు షాక్ ఇచ్చిన శేఖర్ కమ్ముల... స్టార్ హీరోతో లీడర్‌ సీక్వెల్‌కు ప్లాన్..

ఇక ఈ సినిమాతో పాటు అఖిల్ మరోవైపు స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

More from News18 Telugu

image beaconimage beaconimage beacon