మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందంటూ రూమ‌ర్స్‌... ఖండించిన డైరెక్ట‌ర్‌!

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 21-01-22
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీగా ‘లైగర్’ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉండ‌గానే ఆయ‌న మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పారు. ఆ ద‌ర్శ‌కుడే శివ నిర్వాణ‌. నిన్నుకోరి, మ‌జిలీ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన ఈ డైరెక్ట‌ర్ మూడో చిత్రంగా నానితో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ సినిమా చేశారు. ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుద‌లైంది. అయితే ఆశినంత హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేక‌పోయింది. ఇక్క‌డే అస‌లు చిక్కొచ్చి ప‌డింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న లైగ‌ర్ సినిమాతో బిజీగా ఉండ‌టం.. శివ నిర్వాణ సినిమా గురించి ఊసు లేక‌పోవ‌డం ఒక వైపు.. అలాగే మ‌రో వైపు, ఇటీవ‌ల సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ఘ‌న విజ‌యం సాధించిన త‌రుణంలో.. 2023 అద‌ర‌గొట్టేద్దాం అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ రియాక్ట్ కావ‌డంతో విజ‌య్ త‌దుప‌రి సుకుమార్‌తోనే సినిమా చేస్తార‌ని టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ సినిమా నుంచి త‌ప్పుకున్నారంటూ వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతే కాకుండా సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌తో శివ నిర్వాణ సినిమా చేయ‌బోతున్నార‌ని కూడా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై డైరెక్ట‌ర్ శివ నిర్వాణ సోష‌ల్ మీడియా ద్వారా నేరుగా స‌మాధానం చెప్పారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో త‌న సినిమా ఆగిపోయిందని, తాను నెక్ట్స్ మూవీని వెంక‌టేష్‌తో చేయ‌బోతున్నానంటూ వినిపిస్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని చెబుతూ నెట్టింట త‌న సినిమా గురించి వినిపిస్తోన్న వార్త‌లు అవాస్త‌వం ఆయ‌న తేల్చేశారు. దీంతో శివ నిర్వాణ త‌దుప‌రి సినిమాకు సంబంధించిన రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది.

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘లైగర్’ పాన్ ఇండియా రేంజ‌లో విడుదలవుతుంది. మరి శివ నిర్వాణతో మన రౌడీ స్టార్ పాన్ ఇండియా సినిమాను చేస్తారా? లేక టాలీవుడ్‌కి సంబంధించిన సినిమానే చేస్తారా అని తెలియడం లేదు. మరో వైపు పూరీ జగన్నాథ్ తర్వాత విజయ్ దేవరకొండ కోసం మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెయిట్ చేస్తున్నారు. మరి మర రౌడీ హీరో ఓటు ఎవరికో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon