మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

IND vs IRE ఫస్ట్ టీ20‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్య

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 26-06-22
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా టాస్ వేయగా.. కెప్టెన్‌గా హార్దిక్‌కి ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున సత్తాచాటిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఈ టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

భారత్, ఐర్లాండ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్లో టీమిండియాదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు మూడు టీ20ల్లో తలపడగా.. మూడింట్లోనూ టీమిండియాదే గెలుపు. ఇందులో ఓ రెండు మ్యాచ్‌లు ఈరోజు జరుగుతున్న డబ్లిన్‌లోనే జరిగాయి.

భారత టెస్టు టీమ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా తదితర సీనియర్ క్రికెటర్లు అక్కడికి వెళ్లారు. దాంతో.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తున్నాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20లని భారత్ జట్టు ఆడబోతోంది.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon