మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

IND vs NZ 2nd Test: విజయానికి చేరువలో భారత్.. న్యూజిలాండ్ ఎదురీత

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 05-12-21
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విజయానికి టీమిండియా చేరువలో ఉంది. మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం 540 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ టీమ్.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 140/5తో నిలిచింది. క్రీజులో హెన్రి నికోలస్ (36 బ్యాటింగ్: 86 బంతుల్లో 7x4) ఒంటరి పోరాటం చేస్తుండగా.. అతనికి రచిన్ రవీంద్ర (2 బ్యాటింగ్: 23 బంతుల్లో) సహకారం అందిస్తున్నాడు. మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. న్యూజిలాండ్ విజయానికి 400 పరుగులు చేయాల్సి ఉంది. మరోవైపు స్పిన్నర్లకి సహకిస్తున్న పిచ్‌పై భారత్ జట్టు విజయానికి కేవలం 5 వికెట్ల దూరంలోనే ఉంది.

540 పరుగుల ఛేదనని న్యూజిలాండ్ పేలవంగా ఆరంభించింది. ఓపెనర్ టామ్ లాథమ్ (6) సింగిల్ డిజిట్‌ స్కోరుకే ఔటైపోగా.. మరో ఓపెనర్ విల్ యంగ్ (20), సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్‌ టేలర్ (6) కూడా నిరాశపరిచారు. కానీ.. వన్డే తరహాలో దూకుడుగా ఆడేసిన డార్లీ మిచెల్ (60: 92 బంతుల్లో 7x4, 2x6) కాసేపు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే.. టీమ్ స్కోరు 128 వద్ద మిచెల్ ఔటైపోగా.. ఆ వెంటనే టామ్ బ్లండెల్ (0) కూడా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

అంతకముందు.. ఓవర్‌నైట్ స్కోరు 69/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు.. మయాంక్ అగర్వాల్ (62), చతేశ్వర్ పుజారా (47), శుభమన్ గిల్ (47), అక్షర్ పటేల్ (41 నాటౌట్: 26 బంతుల్లో 3x4, 4x6) దూకుడుగా ఆడటంతో రెండో సెషన్‌లో 276/7తో డిక్లేర్ చేసింది. దాంతో.. భారత్‌కి తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 263 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 540 పరుగుల టార్గెట్ కివీస్ ముందు నిలిచింది.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon