మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

IND vs ZIM వన్డే సిరీస్‌కి కొత్త ఓపెనర్లు.. శుభమన్ గిల్‌కి ఝలక్

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 15-08-22
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కి భారత్ జట్టు కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగబోతోంది. ఇప్పటికే జింబాబ్వే గడ్డపైకి చేరుకున్న టీమిండియా ఆగస్టు 18 నుంచి మూడు వన్డేల సిరీస్‌ని ఆడనుంది. ఈ సిరీస్‌లో భారత్ ఇన్నింగ్స్‌ని శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఆరంభించబోతున్నట్లు భారత సెలెక్టర్ దేవాంగ్ గాంధీ స్పష్టం చేశాడు.

వాస్తవానికి ఈ వన్డే సిరీస్‌లో శుభమన్ గిల్‌ని ఓపెనర్‌గా ఆడిస్తారని అంతా ఊహించారు. కానీ.. కేఎల్ రాహుల్‌ని ఆఖర్లో జట్టుతో చేర్చిన భారత సెలెక్టర్లు తాజాగా అతనే ఓపెనర్‌గా ఆడతారని స్పష్టం చేశారు. ఇప్పటికే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా టీమ్‌లో ఉండటంతో కేఎల్ రాహుల్, గబ్బర్ ఓపెనర్లుగా ఆడటం దాదాపు ఖాయమైంది. మరి శుభమన్ గిల్ పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వెస్టిండీస్‌తో జులైలో ముగిసిన మూడు వన్డే సిరీస్‌లో 205 పరుగులు చేసిన గిల్ టాప్ స్కోరర్‌గా మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

వన్డే ప్రపంచకప్ 2023 కోసం జట్టుని సిద్ధం చేసుకునే క్రమంలో శుభమన్ గిల్‌కి ఓపెనర్‌గా అవకాశాలిస్తామని చెప్పుకొచ్చిన సెలెక్టర్లు తాజాగా కేఎల్ రాహుల్‌ కోసం అతడ్ని ఓపెనర్‌ నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుండగా.. ఈ మెగా టోర్నీకి ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఎంపికైన విషయం తెలిసిందే.

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon