మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

Python Snake in Graveyard: ఒక సమాధిలోంచి మరో సమాధిలోకి 6 అడుగుల కొండచిలువ

Zee Hindustan తెలుగు లోగో Zee Hindustan తెలుగు 05-10-22 Zee Hindustan తెలుగు

Python Snake in Muslim Graveyard: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఒక్కసారి చూస్తే చాలు చాలా రోజులు వెంటాడే అనుభవం.. సమాధిని చూసిన ప్రతీసారి గుర్తొచ్చే ఘటన. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా స్మశాన వాటికలో సమాధుల కింద తిరుగుతున్న పెద్ద కొండచిలువ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

© Zee Hindustan తెలుగు ద్వారా అందించబడింది

Python Snake in Muslim Graveyard: కొండచిలువ పాము అంటేనే పాముల్లోనే అతి భయంకరమైన సర్పంగా పేరుంది. కింగ్ కోబ్రా, పైథాన్.. ఈ రెండింట్లో ఏది డేంజర్ అని అడిగితే చెప్పడం కష్టమే. కాకపోతే నాగు పాములు చాలా చోట్ల, చాలా సందర్భాల్లో కనిపిస్తాయి కాబట్టి అవి మామూలే అనిపిస్తాయి. ఇక కొండచిలువలు చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి అవి ఏ సైజులో ఉన్నా కాస్తంత భయం ఎక్కువే. అందులోనూ లావుగా, పొడవుగా ఉండే కొండ చిలువలకు శక్తి ఇంకా ఎక్కువే ఉంటుంది కాబట్టి దానిని చూసినప్పుడు కలిగే ఆ భయం ఇంకొంత పెరుగుతుంది. 

తాజాగా హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో ఉన్న ముస్లిం స్మశానవాటికలో ఓ పెద్ద కొండ చిలువ దర్శనం ఇచ్చింది. ఎవ్వరు చూశారో.. ఎలా చూశారో తెలియదు కానీ.. 6 అడుగులు పొడవైన కొండ చిలువ ఒక సమాధి లోంచి మరో సమాధిలోకి వెళ్తుండగా గమనించిన స్థానికులు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో క్లిప్పింగ్‌లో వినిపిస్తున్న మాటల ప్రకారం ఫలక్ నుమాలోని ఖాద్రి చమాన్ స్మశానవాటికలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అర్థమవుతోంది. స్మశానవాటికలో భారీ కొండచిలువ కనిపించడంతో ఆ చుట్టుపక్కల ఉండే స్థానికులు, తరచుగా అటువైపు వివిధ పనులపై వచ్చిపోయే వారు హడలెత్తిపోతున్నారు. అంతేకాకుండా ఇదే స్మశానవాటికలో ఒక పెద్ద చింత చెట్టు ఉన్నందున చింతకాయల కోసం తరచుగా పిల్లలు ఇక్కడికి వస్తారని.. అందుకే ఆ కొండచిలువను పట్టుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

(Video Source : Siasat twitter )

వీడియోలో కనిపించిన దృశ్యం ప్రకారం ఆ కొండ చిలువ అక్కడే సమాధుల మధ్య ఆశ్రయం చేసుకుని నివాసం ఉంటున్నట్టు అర్థమవుతోంది. ఈ సీన్ చూసిన తర్వాత స్థానికులకు వస్తున్న మరో సందేహం ఏంటంటే.. సమాధుల కింద ఇలాంటి పాములు ఇంకెని ఉన్నాయో అనే భయం స్థానికులను వెంటాడుతోంది. ఆ ఊహే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది కదూ.. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అన్న చందంగా ఏ సమాధి కింద ఏ పాము ఉందో ఎవరికి తెలుసు మరి అని స్థానికులు అనుకుంటున్నారు ! ఈ వీడియో చూసినవాళ్లు ఎవరైనా ఇకపై సమాధుల వైపు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారేమో మరి !!

Also Read : Kissing Cobra Goes Wrong: నాగు పాముకు కిస్ ఇస్తుంటే సడెన్‌గా వెనక్కి తిరిగి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Also Read : Monkey Playing With Tiger: పులిని తెలివిగా ఫూల్ చేసి కిందపడేసిన కోతి.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

More from  Zee Hindustan తెలుగు

image beaconimage beaconimage beacon