మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

కోర్టుకెక్కిన ఈటల భార్య .. హైకోర్టులో పిటిషన్

తెలుగు సమయం లోగో తెలుగు సమయం 04-05-21
© తెలుగు సమయం ద్వారా అందించబడింది

మాజీ మంత్రి ఈటల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. మంత్రివర్గం నుంచి ఈటెల బర్తరఫ్ కాగా ఆయన భార్య తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. జమున హాచరీస్ యజమానిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని పేర్కొన్నారు . తాము ఎక్కడ కూడా కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ అనుమతి లేకుండా హాచరీస్ లోకి ప్రవేశించి అధికారులు హంగామా చేశారని, అనుమతి లేకుండా వెళ్ళిన మెదక్ జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో తదుపరి విచారణ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భూకబ్జాకు సంబంధించి ఈటలపై ఆరోపణలు రావడంతో జమునా హాచరీస్ లో అధికారులు విచారణ చేపట్టారు. దీంతో జమునా హాచరీస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ పిటిషన్ వేసింది.

తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా జమునా హాచరీస్ లోకి వెళ్లి విచారణ చేసిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. అచ్చంపేటలో తమ భూమిలో కి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అటు ఈటెల కూడా సోమవారం ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం చెప్పారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు.

మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాలకు సంబంధించి దర్యాప్తు కమిటీ ప్రభుత్వానికి కీలక నివేదిక అందించింది. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు కమిటీ నిగ్గు తేల్చింది. జమున హాచరీస్ ఆధీనంలో అక్రమంగా 66 ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలగించారని నివేదికలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా జమున హాచరీస్ పౌల్ట్రీ షెడ్డులు నిర్మించారని.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేశారని నివేదికలో తెలిపారు. అసైన్డ్ ల్యాండ్‌ను ఈటల రాజేందర్ కబ్జా చేసినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు

More from Telugu Samayam

image beaconimage beaconimage beacon