మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

రాజమౌళి ఫ్యామిలీకి కరోనా ఎలా సోకింది?

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 2 రోజుల క్రితం Namasthe Telangaana
రాజమౌళి ఫ్యామిలీకి కరోనా ఎలా సోకింది? © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది రాజమౌళి ఫ్యామిలీకి కరోనా ఎలా సోకింది?

దర్శకధీరుడు రాజమౌళిది మొదట్నుంచీ ఉమ్మడి కుటుంబం.. అందరూ కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో వివిధ ఫ్లాట్‌ల్లో నివసిస్తుంటారు. కానీ షూటింగ్స్‌ లేని సమయా ల్లో అందరూ ఉదయం, సాయంత్రం కలుసుకోవడం, వారాంతా ల్లో గెట్‌టుగెదర్‌లా అందరూ ఒకేచోట కలిసి వుంటారు. రాజమౌళి, కీరవాణి, కల్యాణిమాలిక్‌ కుటుంబాలు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా ఇలా అంతా ఒకే చోట అందరూ అనోన్యంగా వుంటారు.

అయితే గత రెండేళ్లక్రితం సూర్యాపేట జిల్లా వద్ద దాదాపు 100 ఏకరాల ఫామ్‌ హౌస్‌ను కొనుగోలు చేశారు రాజమౌళి. ఏ మాత్రం విరామం దొరికిన కుటుంబాలతో కలిసి అందరూ ఆ ఫామ్‌ హౌస్‌కు వెళ్తుంటారు. తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో కూడా రాజమౌళి ఫ్యామిలీతో పాటు కీరవాణి కుటుంబం ఇలా అందరూ ఫామ్‌ హౌస్‌కు వెళ్లారట. అక్కడే కొంతకాలం గడిపిన వాళ్లు ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారని తెలిసింది.

వచ్చి రాగానే కుటుంబంలో అందరికి జ్వరం రావడంతో టెస్ట్‌ చేయించుకోగా మైల్డ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబసభ్యులందరూ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇక రాజమౌళి కుటుంబసభ్యులకు ఫామ్‌హౌస్‌లోనే అక్కడి చెందిన ఎవరో ఒకరి నుండి కరోనా సోకిందని అనుమానం వ్యక్తంచేసున్నారు అందరూ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon