మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవిపై వీడని ఉత్కంఠ..! ద‌రఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ..!

News18 తెలుగు లోగో News18 తెలుగు 17-10-21 News18 Telugu
"రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవిపై వీడని ఉత్కంఠ..! ద‌రఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ..!" © News18 తెలుగు ద్వారా అందించబడింది "రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవిపై వీడని ఉత్కంఠ..! ద‌రఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ..!"

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ (T-20 World Cup 2021) తో ప్ర‌స్తుత కోచ్ ర‌విశాస్త్రి (Ravi Shastri) పదవీ కాలం ముగియనుంది. ఈ మెగాటోర్నీ తర్వాత అతను త‌ప్పుకోనుండ‌టంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ(BCCI) ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీమిండియా మాజీ క్రికెటర్.. ది వాల్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) ను టీమిండియా (Team India) హెచ్ కోచ్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయ్. మీడియా కూడా కోడై కూసింది. అయితే, ఈ నియామకంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఎందుకంటే.. బీసీసీఐ లేటెస్ట్ గా టీమిండియా మెన్స్ హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ సహా బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ మరియు ఫీల్డింగ్ కోచ్ స్థానాలకు కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. వీటితో పాటుగా నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో స్పోర్ట్స్‌ సైన్స్‌ మరియు మెడిసిన్ హెడ్ ప‌ద‌వుల‌కు కూడా ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌విపై కొంత‌కాలంగా చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో బీసీసీఐ పలు పదవుల కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించడం విశేషం.

టీమిండియా హెడ్ ​​కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారికి అక్టోబర్ 26, 2021న సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. ఈ సమయం దాటితే.. బీసీసీఐ ఎలాంటి దరఖాస్తులను తీసుకోదు. ఇత‌ర ప‌ద‌వుల కోసం న‌వంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కూ బీసీసీఐ స‌మ‌యం ఇచ్చింది. మరోవైపు రాహుల్ ఎంపిక దాదాపు లాంచనమే అని తెలుస్తోంది. అయితే, బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ జరగనుంది.

రవిశాస్త్రి మాదిరిగా రాహుల్ ఎంపిక కూడా ఏకగ్రీవం కానుంది. రాహుల్ సహా ఇంకా ఎవరన్నా హెడ్ కోచ్ ప‌ద‌వికి దరఖాస్తు చేస్తారో లేదో చూడాలి. టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది.

ఇప్పటికే శాస్త్రి కోచ్ పదవిలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాడు. మరోసారి ఆ బాధ్యతలు చేపెట్టేందుకు అతడు సముఖంగా లేదు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ కూడా మెగా టోర్నీ అనంతరం తమతమ పదవుల నుంచి తప్పుకోనున్నారు. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. బౌలింగ్‌ కోచ్‌గా పరాస్‌ మాంబ్రే ఎంపిక లాంఛనం కానుంది.

ఇది కూడా చదవండి : " పాక్ తో మ్యాచ్ ఆడొద్దు... ఆ జట్టును బ్యాన్ చేయండి " .. టీమిండియాపై పెరుగుతున్న ఒత్తిడి..

ఇక బ్యాటింగ్‌ కోచ్‌గా ప్రస్తుతం ఉన్న విక్రమ్‌ రాథోడ్ అదే పదవిలో కొనసాగనున్నాడని సమాచారం. టీ20 ప్ర‌పంచక‌ప్ త‌ర్వాత న్యూజీలాండ్ ప‌ర్య‌ట‌న‌తో టీమిండియా కోచ్‌గా ద్రావిడ్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని స‌మాచారం.హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులు, కనీసం 30 టెస్టు మ్యాచులు లేదా 50 వన్డే మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు.. సినిమా థియేటర్లలో ప్రపంచకప్ మ్యాచ్ లు.. టికెట్ ధర ఎంతో తెలుసా..?

లేదా టెస్టులు ఆడే జట్టుకి కనీసం రెండేళ్ల పాటు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించి ఉండాలి. లేదా ఐపీఎల్ జట్టుకి, లేదా దానికి సమానమైన విదేశీ లీగ్‌కి కానీ, పస్ట్ క్లాస్ జట్లకి, జాతీయ ఏ జట్లకీ కనీసం మూడేళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించి ఉండాలి.అలాగే 60 ఏళ్లలోపు వయసుండాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ పదవులకి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 10 టెస్టు మ్యాచులు, 25 వన్డేలు ఆడిన అనుభవం ఉంటే సరిపోతుంది.

More from News18 Telugu

image beaconimage beaconimage beacon